YSR Aasara Scheme : డ్వాక్రా మహిళలకు జగన్ శుభవార్త…నాలుగో విడత నేటి నుండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSR Aasara Scheme : డ్వాక్రా మహిళలకు జగన్ శుభవార్త…నాలుగో విడత నేటి నుండి…

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,11:00 am

YSR Aasara Scheme : ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ వైయస్సార్ ఆసరా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ ఇటీవల విడుదల చేయనున్నారు. అయితే 2019 ఏప్రిల్ 11 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో 78,94 ,169 మంది పొదుపు మహిళల పేరుతో దాదాపు రూ.25,570.80,కోట్ల అప్పు బ్యాంకులో ఉండగా దానిలో ఇప్పటికే మూడు విడతల్లో దాదాపు రూ.19,175.97 కోట్లను వైసిపి ప్రభుత్వం మహిళలకు చెల్లించటం జరిగింది. ఇక మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు చివరి నాలుగో దశగా ఈరోజు నుండి నేరుగా వారికే చెల్లించబోతున్నారు.

అయితే వైయస్సార్ ఆసరా పథకం అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ సచివాలయాలలో ఉంచటం జరిగింది. ఇక ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 0863-2347302 కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేదా ఈమెయిల్ ఐడి supportmepma@apmepma.gov. in ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే వైయస్సార్ ఆసరా సంక్షేమ పథకం ద్వారా నాలుగో విడతను నేరుగా డబ్బులను అందజేయడంతో పాటు ఆ డబ్బును మహిళలు వారి అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకొని వెసులుబాటును కూడా జగన్ ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంతేకాక అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో మరియు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పుడు విపరీతంగా వ్యాపారాలు పెరిగాయని చెప్పాలి.

ఇక వైయస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తూ వస్తుంది. అయితే ఈ పథకం పొందేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిగా అర్హత కలిగి ఉండాలి. అలాగే డ్వాక్రా గ్రూపులలో సభ్యురాలు గా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ లోన్ డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో నివాసం ఉంటున్న నివాస రుజువు పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇక ఇవన్నీ కలిగి ఉండి పథకానికి అర్హులైన వారి అకౌంట్ లో డబ్బులు జమ కాకపోతే వెంటనే అధికారులను సంప్రదించమని తెలియజేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది