Kumbha Rasi : జూన్ నెలలో కుంభ రాశి వారి జీవితం మారబోతోంది… ఇక పట్టిందల్లా బంగారమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kumbha Rasi : జూన్ నెలలో కుంభ రాశి వారి జీవితం మారబోతోంది… ఇక పట్టిందల్లా బంగారమే…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 May 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Kumbha Rasi : జూన్ నెలలో కుంభ రాశి వారి జీవితం మారబోతోంది... ఇక పట్టిందల్లా బంగారమే...!

Kumbha Rasi : కుంభరాశి వారికి జూన్ నెలలో ఆశించినటువంటి లాభాలు చేకూరనున్నాయి. అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని పనులను ముందుగా ప్రణాళిక వేసుకొని చేయడం వలన ఆ పనులలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. అలాగే వారికి తగ్గిన గుర్తింపు లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు ఆలోచించే విధానం బట్టి ప్రశాంతత ఉంటుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకున్న కుంభరాశి జాతకులకు ఇది ఒక అవకాశంగా అనుకోవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోరుకుంటూ వీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు కంగారు పడకపోతే అది కొంత ప్రమాదాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సంతానం కలగకపోతే ముందు రోజుల్లో సంతానం కలగడం కష్టంగా మారుతుంది. అలాగే సంతాన యోగం కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంటుంది కాబ్బటి ఇప్పుడే ప్రయత్నాలు చేయడం మంచిది. కొన్ని కొన్ని వ్యవహారాల యందు చాకచక్యంగా వ్యవహరించడం మంచిది.

ఆర్థిక వ్యవహారాలలో రుణ బాధల నుంచి విముక్తి పొందే అవకాశం కనిపిస్తుంది .గతంలో చేసినటువంటి రుణము చిన్నదైన పెద్దదైన ఈ మాసంలో తీరే అవకాశం కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి వ్యాపారం జరుపుటకు మీరు తీసుకున్న ఒక నిర్ణయం చాలా ఆలోచింపచేస్తుంది. కాబట్టి ఆలోచనతో వ్యాపారం చేయడం అనేది చాలా మంచిది. మోసపూరితమైన వ్యక్తులు ఈ కుంభరాశి స్త్రీల వెనక తిరుగుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నట్లయితే నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే పరిస్థితులు అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. దూరం వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కానీ ఉన్నాయి అనే భ్రమలో ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటిి రాజకీయ నాయకులు కొత్త పదవుల కోసం ఆరట పడుతూ ఉంటారు. అటువంటి వారికి నిరుత్సాహం ఎదురయ్యే అవకాశం ఉంది.

Kumbha Rasi జూన్ నెలలో కుంభ రాశి వారి జీవితం మారబోతోంది ఇక పట్టిందల్లా బంగారమే

Kumbha Rasi : జూన్ నెలలో కుంభ రాశి వారి జీవితం మారబోతోంది… ఇక పట్టిందల్లా బంగారమే…!

కొంత కఠినంగా ఉన్న రాజకీయ నాయకులకు అపజయం కలుగుతుంది. విద్యార్థులకు అద్భుతమైన అవకాశం విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కుంభ రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అవమానాన్ని కూడా కొంతమంది సన్మానం అనుకుంటారు. అయినప్పటికీ కుంభ రాశి వారికి కొన్ని సత్ఫలితాలు కలుగుతాయి. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.అలాగే కుంభరాశిలో ఉన్న వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంటి పక్కలో ఉన్న దేవాలయాలను సందర్శించండం శుభ ఫలితాలను కలుగజేస్తుంది.

Kumbha Rasi : పరిహారాలు..

కుంభ రాశి వారు ప్రతి శనివారం పూట ఆవుకి ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి చల్లారిన తర్వాత రెండు చిటికెడల ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు గుప్పల్లో తినిపించండి. పచ్చి గడ్డిని ఆవుకి సమర్పించండి. గోసేవ చెయ్యండి. మీ బాధలు ఏవైతే ఉన్నావే అవి గోవు దగ్గర మౌనంగా చెప్పండి. గోవు తప్పనిసరిగా మీ మనసులో బాధని తీరుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది