Ugadi 2025 : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ugadi 2025 : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ugadi 2025 : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి...? ఆరోజు ఏ పనులు చేయాలి... ఇలా చేస్తే కష్టాలే...?

Ugadi 2025 : ఉగాది అనగా యుగాది. యుగాది అంటే సంవత్సరాది. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అని అర్థం. రైత్ర మాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్లో తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాలలో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. సంవత్సరం 2025 మార్చి 30న ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. రోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేస్తే శుభప్రదం. అదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం కష్టాలు తప్పవు.

Ugadi 2025 ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి ఆరోజు ఏ పనులు చేయాలి ఇలా చేస్తే కష్టాలే

Ugadi 2025 : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?

ఉగాది అంటేనే నక్షత్ర గమనం… యుగం ప్రారంభమైన రోజు. యుగాది కార్యక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఒక్కొక్క తెలుగు సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 29 న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలుకానుంది. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ సంప్రదాయంగా జరుపుకునే పండుగ. ఈ ఉగాది రోజున పూజ ఏ టైంలో చేయాలి..? ఉగాది రోజున ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు అనే విషయం తెలుసుకుందాం…

చైత్ర శుద్ధ పాడ్యమి తిథి…2025 మార్చి 31 తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిగా పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం మొదలుకానుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. తే కాదు ఉదయం 9 గం. నుంచి 11: 30 గం. కొత్త బట్టలు ధరించి.. యజ్ఞోపవిత ధారణ చేయవచ్చు. అంతేకాదు, ఈ సమయం ఉగాది పచ్చడి తినడానికి శుభసమయం అని చెబుతున్నారు పండితులు.
ఆది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు, బెల్లం,చింతపండు, బంగారం,వెండి,మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

Ugadi 2025 ఉగాది రోజున ఏ పనులు చేస్తే శుభప్రదం

ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి ముందు రోజే ఇంటిని శుభం చేసుకోవాలి. ఉగాది రోజున తెల్లవారుజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. శుభ్రం చేసి కాలాకృత్యాలు తెచ్చుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేయాలి. అభ్యంగ స్నానం చేయాలి. నువ్వుల నూనెతో నలుపు పెట్టుకుని కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు మంగళకరం. కనుక కొత్త బట్టలను ధరించాలి. నుదుట బొట్టుని పెట్టుకోవాలి. ఇంటి గుమ్మాలకు వేప కొమ్మలు. మీడియా ఆకులతో తోరణాలు కట్టాలి. దేవుడికి పూజ చేసే వేప పువ్వులతో చేసిన వేప పువ్వు పచ్చడి తినాలి.

ఉగాది పండుగ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు : ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తని ఇంటి నుంచి బయటకు వెయ్యవద్దు. చేయడం వలన నా సంపద బయటకు పోతుందని నమ్మకం. ఉగాది రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవలు,వాగ్వాదాలు చేయవద్దు. అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు. రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు. మాంసాహారం తినొద్దు. మద్యం సేవించవద్దు. జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయకూడదు. అది రోజున చినిగిన దుస్తులను అస్సలు ధరించవద్దు.

Advertisement
WhatsApp Group Join Now

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది