Maha Shivaratri : మహాశివరాత్రి నాడు ఈ పనులు చేస్తేచాలు శివకటాక్షం తథ్యం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Shivaratri : మహాశివరాత్రి నాడు ఈ పనులు చేస్తేచాలు శివకటాక్షం తథ్యం !

 Authored By keshava | The Telugu News | Updated on :9 March 2021,9:54 pm

Maha Shivaratri : మహాశివరాత్రి.. అత్యంత పరమ పవిత్రమైన రోజు. శివుడికి అత్యంత ప్రతీకరమైన రోజు. జ్యోతిస్పాటిక లింగంగా ఆవిర్భవించిన రోజు. మార్చి 11 అంటే ..మాఘ మాసంలోని కృష్ణ పక్షం,చతుర్ధశి మహాశివరాత్రి. ఈరోజు ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. ఈరోజు శివుడి అనుగ్రహం, కటాక్షం లభించాలంటే..చేయాల్సిన విశేషాలను తెలుసుకుందాం.. ప్రధానంగా తెల్లవారుఝామున లేవాలి, తలస్నానం చేయాలి. తర్వాత దేవుడి గదిలో దీపారాధన చేయాలి.

ఆ రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు లేకుంటే అల్ఫాహారంతో గడపాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఆరోజు స్వామి నామాన్ని అదే పంచాక్షరి జపాన్ని నిరంతరం మనసులో చేసుకోవాలి. అభిషేకం, బిల్వార్చన, దానం, ధర్మం, జాగరణ ఈ పనులు చేస్తే తప్పక శివానుగ్రహం కలుగుతుంది. అవకాశం ఉన్నవారు రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేయాలి అంతేకానీ సినిమాలు చూడకూడదు. మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదంటారు. ఇక మహాశివరాత్రి నాడు చేసే జాగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

maha shivaratri puja vidhi

maha shivaratri puja vidhi

Maha Shivaratri : స్కాంద పురాణంలో శివరాత్రి గురించి ఏం ఉందంటే..?

శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమే జాగారం. ఇలా చేసిన వారికి మళ్లీ పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని కొందరు కబుర్లు చెప్పుకుంటూ, లేదా టీవీల్లో ప్రోగ్రామ్స్, లేదా సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తారు..అలా చేయడం చాలా తప్పు.. శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ జాగారం చేస్తే ఫలితం ఉంటుంది. రా

త్రిలింగోద్భవ కాలంలో శివకళ్యాణం, అభిషేకం చేయడం లేదా చూడటం చేస్తే అత్యంత పరమపవిత్రం. ఉపవాసం అనేది ఎనిమిదేండ్లలోపు పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు, అనారోగ్యంతో ఉన్నవారు, కర్షకులు, శ్రామికులు, ఉద్యోగాలకు పోవాల్సిన వారు, బాలింతలు ఉండకూడదు. వారు ఉపవాసం లేకున్నా దోషం లేదు. ప్రతి ఒక్కరు వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండాలి. అంతేకానీ పట్టుదలతో, మొండిగా ఉండకూడదని శాస్త్రం, పండితులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి ==> మహాశివరాత్రి ప్ర‌త్యేకం మీ కోసం : మహాశివరాత్రి రోజు నాలుగు జాముల పూజ చేస్తే వచ్చే ఫలితాలు ఇవే !

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది