Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :7 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ఇంటి నిర్మాణంలో కానీ వివిధ చోట్ల వాస్తు శాస్త్రాన్ని కచ్చితంగా అనుసరిస్తారు. ఈ విధంగా వాస్తు నియమాలను పాటించడం వలన ఇంట్లో నివసించేవారు సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు. అయితే ఈ వాస్తు శాస్త్రాన్ని ఎంతగా పాటించినప్పటికీ ఎక్కడో ఒకచోట చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇక ఆ పొరపాట్లు ఖరీదు అనేది తర్వాత తెలిసి వస్తుంది. అలాంటి పొరపాట్లలో తినడం కూడా ఒకటి. అంతేకాక తిన్న తర్వాత గిన్నెలు ఎక్కడ ఉంచాలి. అసలు ఏం తినాలి, ఎలా కూర్చుని తినాలి, ఎక్కడ తినాలి , ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. జ్యోతిష శాస్త్రంలో కూడా ఈ విషయంపై మార్గాన్ని సూచించడం జరిగింది. అంతేకాక ఆహారం తీసుకునేటప్పుడు ఏం చేయకూడదో కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

– ఆహారం తినడానికి కూర్చున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవడం మంచిదని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఇక దక్షిణ ముఖంగా భోజనం అస్సలు చేయకూడదట. ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందని తెలియజేయడం జరిగింది.

– ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో కుర్చీలు లేదా మంచాలు బల్లాలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ ను ఎప్పుడూ కూడా ఖాళీగా అసలు ఉంచకూడదట. పండ్లు స్వీట్లు లేదా మరి ఏదైనా ఆహార పదార్థాల్ని అక్కడ ఉంచాలి. అదేవిధంగా మంచంలో కూర్చుని ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. నేలపై కూర్చుని అన్నం తినడం అనేది అన్ని విధాలుగా మంచిది.

– ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలామంది ఫోన్ చూస్తూనే భోజనం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలు మంచిది కాదు. దీని కారణంగా జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతేకాక దీర్ఘకాలిక అనారోగ్యంతో కూడా బాధపడతారు.

Eating Food ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

– చాలామంది ఆహారం తినేటప్పుడు ఆహారంతో పాటు పక్కన ఉప్పుని కూడా వేసుకుంటారు. అయితే మనం తినే కంచంలో ఉప్పును ఎప్పుడూ విసిరేయకూడదు. ఒకవేళ ఉప్పు అవసరమైతే ఆ కంచంలో కొద్దిగా నీరు పోసి ఉప్పు కరిగేలా చేయాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

– ఆహారం తిన్న తర్వాత వంట గిన్నెలను ఎక్కడపడితే అక్కడ అసలు పెట్టకూడదు. అంతేకాదు వంట గిన్నెలను వెంటనే శుభ్రం చేసుకోవాలి. చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత వంట గిన్నెలను మర్నాడు కడుగుదామని వదిలేస్తారు. ఈ తప్పు అసలు చేయకూడదు. ఈ రోజు తిన్న గిన్నెలను ఆ రోజే వెంటనే శుభ్రం చేసుకోవడం మంచిది. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది