
Bigg Boss Telugu 8 : ఎక్కడా తగ్గేదే లే అంటున్న గౌతమ్.. విశ్వక్ సేన్ సందడి మాములుగా లేదు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ చివరి మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్‌లో మెగా చీఫ్ కంటెండర్స్‌గా యష్మీ, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ నిలిచారు. వీరందరికి పోటీ పెట్టాడు బిగ్ బాస్. అయితే, దీనికి సంచాలక్‌గా గౌతమ్‌ను కావాలనే నియమించాడు బిగ్ బాస్. హౌజ్‌లో కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతోందని గౌతమ్ పెద్ద వార్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. “పట్టువదలని విక్రమార్కులు” అనే టాస్క్ ఇచ్చారు.వీరంతా బ్లూ, రెడ్ ఇలా రంగులు ఉన్న డ్రమ్స్‌పై తాడు పట్టుకుని నిలబడాలి. సంచాలక్ అయిన గౌతమ్ డైస్‌ను రోల్ చేసి అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌ను తీసేస్తాడు.
Bigg Boss Telugu 8 : ఎక్కడా తగ్గేదే లే అంటున్న గౌతమ్.. విశ్వక్ సేన్ సందడి మాములుగా లేదు..!
దాంతో దానిపై ఉన్న వాళ్లు వేలాడుతారు. ఎక్కువ సేపు వేలాడలేరు కాబట్టి టాస్క్ నుంచి అవుట్ అవుతారు. అయితే, ఈ టాస్క్‌లో ముందుగా పృథ్వీ, యష్మీని పీకేసి రోహిణి, తేజకు గౌతమ్ సపోర్ట్ చేస్తాడు అని అంతా అనుకున్నారు.కానీ, గౌతమ్ ఎలాంటి ఫేవరిజం చూపించకుండా కలర్స్‌పై వై, ఆర్, టీ, పీ అని నేమ్ లెటర్స్ రాసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవరి నేమ్ వస్తే వారి డ్రమ్‌ను తీసేసాడు. అలా గౌతమ్ క్లియర్‌గా న్యాయమైన గేమ్ ఆడాడు. తనను నెగెటివ్ చేద్దామని వేసిన బిగ్ బాస్ చెత్త ప్లాన్‌ను తిప్పి కొట్టాడు గౌతమ్. దీంతో గౌతమ్ మాస్టర్ మైండ్‌కు బిగ్ బాస్‌కు, కన్నడ బ్యాచ్ షాక్ అయ్యారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలినట్లు అయింది. రోహిణి, నిఖిల్ ఇద్దరిలో చీఫ్ టాస్క్ కంటెండర్ గా ఎన్నుకునే ఆప్షన్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. దానికి సంబంధింన వాదన జరుగుతన్న టైమ్ లో గౌతమ్ తెలివిగా వైల్డ్ కార్డ్స్ ను టార్గెట్ చేశారంటూ రెచ్చగొట్టాడు.
దాంతో పృధ్వీ స్పందించాడు. ఆ వాదన కాస్త పెరిగి పెరిగి పెద్ద వివాదం అయ్యింది. ఇద్దరు ఆవేశపరులు కావడంతో నోరు జారుడు.. మాటలు మీరుడు అన్నీ జరిగిపోయాయి. సో ఈ విషయంలో నాగార్జున క్లాస్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే రెండు వారాలే ఉంది.. ఎవరి కర్మ వారిది.. మొదటి నుంచి చెపుతూనే ఉన్నాడు నాగ్. దాంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయిలో జరిగింది. అయితే మరోసారి కన్నడ బ్యాచ్ తమ గ్రూప్ గేమ్ ను చూపించుకుంది. గౌతమ్ పై మూకుముడిగా దాడికి తెగబడ్డారు. ఈరెండు మూడు వారాల్లో బ్యాలన్స్ ఎవరైనా ఉంటే ప్రమోషన్లకు రాబోతున్నారు. అందులో భాగంగా ఈ వారం హౌస్ లోకి విశ్వక్ సేన్ వచ్చాడు. విశ్వక్ ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు.. సరదా టాస్క్ లు. పంచ్ లు, నవ్వులు, ఇలా ప్రశాంతంగా గడిచింది. బిగ్ బాస్ హౌస్ లో విశ్వక్ సేన్ ఎపిసోడ్. Bigg Boss Telugu 8 fights tasks and celebrity appearances as the final weeks
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.