Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ .. 11 రోజులు రిమాండ్ కి తరలించిన పోలీసులు..!!
Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయింది. గత సీజన్ కంటే ఈ సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈసారి బిగ్ బాస్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచారు. అయితే ఆయనను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. తన స్వగ్రామం అయిన కొల్లూరులో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు.
ఆరు సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వాహనాలతో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ద్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు. రెండు వర్గాల దాడిలో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఇలా ప్రభుత్వ ప్రైవేటు వాహనాలపై దాడి చేయడంతో పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు పెట్టారు. ఈ అల్లర్లపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదయింది. పల్లవి ప్రశాంత్ ఏ 1 గా, అతని సోదరుడు మనోహర్ ఏ 2 గా, ఫ్రెండ్ వినయ్ ఏ 3 గా చేర్చారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లి అతడిని, అతడి తమ్ముడిని అరెస్టు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన నానా హంగామా కి బిగ్ బాస్ గెలిచిన ప్రశాంత్ కి సంతోషం లేకుండా పోయింది. అభిమానులు చేసిన పనికి పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పల్లవి ప్రశాంత్ ను 11 రోజులు రిమాండ్ లో ఉంచనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ పల్లెటూరు కుర్రాడు అయిన బిగ్బాస్ కి వెళ్ళాడు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.