Gemini TV : జెమిని టీవీ కష్టాలు.. పెట్టేది 100 వచ్చేది 25
Gemini TV : తెలుగులో శాటిలైట్ ఛానల్స్ ప్రారంభమైన సమయంలో స్టార్ మా, జీ తెలుగు లేనే లేవు. ఈటీవీ మరియు జెమిని కాస్త అటు ఇటుగా ఒకే సారి ప్రారంభమయ్యాయి. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సరి కొత్త వినోదపు ప్రపంచాన్ని ఈ రెండు చానల్స్ పోటీ పడి మరీ చూపించాయి. రెండు చానల్స్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా నెంబర్ వన్ స్థానం కు పోటీ పడేవి. ప్రతి సారి కూడా ఈ రెండు చానల్స్ నెంబర్ 1 స్థానం వద్ద సరి సమానమైన బలం కలిగి ఉండేవి. ఈ రెండు చానల్స్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒకప్పటి వీటి ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా మరియు జీ తెలుగు హవా కొనసాగుతోంది. ఈటీవీ ని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మరికొన్ని గేమ్ షోలు కాపాడుకుంటూ వస్తున్నాయి. ఇక జెమినీ టీవీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
తమిళనాడుకు చెందిన సన్ నెట్వర్క్ వారి జెమినీ టీవీ 4 స్థానంలో ఉంది. సీరియల్స్ కానీ షోస్ కానీ ఏ ఒక్కటి జెమినీ టీవీకి పూర్వ వైభవం ని తెచ్చి పెట్టడం లేదు. భారీ మొత్తంలో ఖర్చు చేసి కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం అయితే ఉండడం లేదు. ఒకప్పుడు నెంబర్ వన్ తెలుగు ఛానల్ గా ఉన్న జెమినీ టీవీ ఇప్పుడు రేటింగ్ విషయంలో అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. న్యూస్ చానల్స్ స్థాయిలో కూడా వ్యూస్ రావడం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. జెమినీ టీవీ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఒక ప్రముఖ జర్నలిస్టు చెప్పిన దాని ప్రకారం జెమినీ టీవీ కోసం యాజమాన్యం ఖర్చు చేస్తున్నది వంద రూపాయలు కాగా తిరిగి వారికి వస్తున్నది 25 రూపాయలు మాత్రమే నట. ఇందులో నిజం ఎంతో కానీ పరిస్థితి చూస్తే అలాగే ఉంది అంటూ చాలా మంది బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నా రు.
సన్ నెట్వర్క్ వారికి తమిళంలో పలు చానల్స్ ఉన్నాయి. అవి సూపర్ హిట్ గా దూసుకు పోతున్నాయి. నెంబర్ వన్ ఛానల్ గా అక్కడ ఛానల్స్ నిలిచిన కారణంగా అక్కడి నుండి వచ్చే ఆదాయంలో ఇక్కడ పంచుతున్నారు. అంతే తప్పితే ఇక్కడి నుండి ఆదాయం రావడం లేదని సమాచారం అందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొన్నాళ్ళకు జెమినీ టీవీని తెలుగు ప్రేక్షకులు చూడరేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జెమిని టీవీ, జెమిని సినిమాలు, జెమిని మ్యూజిక్ ఈ మూడు చానల్స్ కూడా పెద్దగా రేటింగ్ దక్కించుకొని కారణంగా త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సన్ నెట్వర్క్ దుకాణం మూసిన ఆశ్చర్యం లేదు అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. జెమిని టీవీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న 1980 కిడ్స్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెమిని కి పూర్వ వైభవం కావాలని వారు కోరుకుంటున్నారు.