Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!

Renu Desai doesn’t like it at all

Renu Desai  : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ అభిమానులతో తన అభిప్రాయాలు, జీవిత విశేషాలు పంచుకుంటుంటారు. తాజాగా ఆమె సమ్మర్ వెకేషన్ కోసం తన కుమార్తె ఆద్యతో కలిసి ప్రయాణించడంతో పాటు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ బక్స్ కాఫీ తాగుతున్న ఆద్యను చూసి, రేణూ దేశాయ్ “నాకు స్టార్ బక్స్ కాఫీ నచ్చదు, దానికి ఇంత ఖర్చు ఎందుకు?” అంటూ స్పందించగా, ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Renu Desai రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట

Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!

Renu Desai : ‘స్టార్ బక్స్ కాఫీ’ ఏమాత్రం నచ్చదంటున్న రేణుదేశాయ్

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యింది. “నాకు జీవితంలో ఓ భాగస్వామి కావాలనే కోరిక ఉంది కానీ, ప్రస్తుతం నా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నా” అని చెప్పిన ఆమె.. “ఆద్యకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా అని తెలిపింది. ఇదే ఇంటర్వ్యూలో “బద్రి” సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, అమిషా పటేల్ రాకపోవడంతో తానే అకస్మాత్తుగా ఒక పాటలో నటించాల్సి వచ్చిందని తెలిపింది.

ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పిల్లలతో సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆద్యతో కలిసి ఆమె తన కుమారుడు అకిరా నందన్ వద్దకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అకిరా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాడని, అక్కడ యాక్టింగ్ మరియు మ్యూజిక్ కోర్సుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది