Tamannaah Bhatia : హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసి తనకంటూ సెపరేట్ గుర్తింపు సంపాదించింది. నటిగా మాత్రమే కాక మోడలింగ్ రంగంలో కూడా రాణించింది. ఏ రకంగా నటన ఉంటుందో అదే రీతిలో డాన్స్ పరంగా కూడా తిరుగులేని క్రేజ్ తమన్నా సొంతం. దాదాపు 15 సంవత్సరాలకు పైగా చలనచిత్ర రంగంలో రాణిస్తున్న తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంది.ఒకప్పుడు టాప్ హీరోలతో నటించి వరుస పెట్టి హిట్లు అందుకున్న తమన్నా తర్వాత పరాజయాలు ఎదుర్కొంది. ఈ దెబ్బతో అంది వచ్చిన అవకాశమే అదునుగా ఎక్కువగా సీనియర్ హీరోలతో ఛాన్సులు అందుకుంటూ ఉంది.

మొన్న విక్టరీ వెంకటేష్ తో “F3”, చిరంజీవితో “భోళా శంకర్”… లేటెస్ట్ గా రజినీకాంత్ “జైలర్” సినిమాలో కూడా నటించడం జరిగింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రాణించినట్టు బాలీవుడ్ లో రాణించలేకపోయింది. ఇదిలా తమన్నా ఇటీవల సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా సముద్రపు ఒడ్డున బీచ్ దగ్గర పడుకుని మరి ఫోటోలు దిగింది.
అంతేకాదు బీచ్ వదల డాన్స్ చేస్తూ ఇంద్రధనస్సు మధ్య దేవకన్య మాదిరిగా ఓ ఫోటో దిగింది. పింక్ కలర్ డ్రెస్ లో పాల రంగు శరీరంలో తమన్నా అందాలు మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో కాఫీ తాగుతూ కూడా స్టిల్స్ ఇచ్చింది. తమన్నా లేటెస్ట్ ఫోటోస్ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.