Jani Master : ఎంత బిజీగా ఉన్న జానీ మాస్టర్ ఢీ కి హాజరు అవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటి…?
Jani Master : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్స్ గా గుర్తింపు దక్కించుకున్న శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ లకి ఢీ డాన్స్ షో లైఫ్ ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ కారణంగానే శేఖర్ మాస్టర్ మొన్నటి వరకు జడ్జ్ గా వ్యవహరించాడు. అయితే స్టార్ మా నుండి అతడికి పిలుపు రావడంతో అటు వెళ్ళాడు. ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక డ్యాన్స్ షో కోసం జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సమయంలో ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కి జడ్జిలుగా ఎవరూ లేక ఇబ్బంది అవుతుంది. గణేష్ మాస్టర్ చాలా రోజులుగా కంటిన్యూ అవుతున్నాడు.
హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు మారుతూ జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక మోస్ట్ బిజీగా ఉన్న జానీ మాస్టర్ అప్పుడప్పుడు ఢీ డాన్స్ కార్యక్రమానికి వచ్చి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు తెలుగు, తమిళం, హిందీ సినిమాల కు కొరియోగ్రఫీ అందిస్తున్న జానీ మాస్టర్ మరో వైపు హీరోగా కూడా ఒక సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఇంత బిజీగా ఉన్న జానీ మాస్టర్ ఈ టీవీ పై ఉన్న అభిమానంతో మరియు మల్లెమాలపై ఉన్న గౌరవంతో జడ్జ్ గా వ్యవహరించేందుకు ఏమాత్రం సమయం దొరికిన వచ్చేస్తూ ఉంటాడు. పారితోషికం విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా జానీ మాస్టర్ ఈ కార్యక్రమానికి వస్తాడని మల్లెమాల వారు అంటూ ఉంటారు. జానీ మాస్టర్ వచ్చిన ప్రతి వారం కూడా షో కి మంచి రేటింగ్ వస్తుంది అంటూ ప్రేక్షకులు మరియు నిర్వాహకులు అంటూ ఉంటారు, ఆయన వస్తే ఒక ఊపు వస్తుంది అన్నట్లుగా డాన్సర్స్ కూడా అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు.

why Jani Master coming even busy with movies for dhee dance show
ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆయన ఉండాలని అంతా కోరుకుంటారు. జానీ మాస్టర్ యొక్క గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఎలా అయితే పండిస్తారో తన జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుంది అంటూ పలు సందర్భాల్లో నిరూపించారు. ఆయన ముందు డాన్స్ చేయడం అంటే డాన్సర్స్ కి గొప్ప అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం జానీ మాస్టర్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా నెలలో రెండు మూడు ఎపిసోడ్స్ కి అయినా రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసంతో ఆయన ఢీ డాన్స్ షో లో పాల్గొంటున్నాడు తప్పితే డబ్బు కోసం కాదు అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మరో కొరియోగ్రాఫర్ పై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు, ఆయన డబ్బు కోసం వేరే ఛానల్ కి వెళ్ళాడు అంటూ కామెంట్ చేసే వారు కొంతమంది ఉన్నారు.