Health Tips : కొవ్వును తగ్గించుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
Health Tips : ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద అందరూ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూర్చుని చేసే పనుల వల్ల ఈజీగానే బరువు పెరిగిపోతున్నారు. అందువల్ల కొవ్వు తగ్గించుకుని బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నారు. కాగా మనం ఇప్పుడు మకాడమియా అనే డ్రై ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా త్వరగా కొవ్వును తగ్గించుకునేందుకు మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇది కొంచెం ధర ఎక్కువ అని తెలుస్తోంది. మరి దాని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
అయితే ఈ ఈ గింజలు ఒక్కటి తీసుకున్నా సరే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని రుచి అచ్చం వెన్నలాగే ఉంటుందని చెబుతున్నారు. కాగా ఈ డ్రై ఫ్రూట్స్ ను పచ్చిగా అయినా తినొచ్చు లేదంటే వంటల్లో కూడా తీసుకోవచ్చు అని వివరిస్తున్నారు. ఇవి తిన్న వెంటనే తమ పని మొదలు పెడుతాయంట. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్స్ బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించేస్తాయంట. ఇందులో త్వరగా ఆహారం జీర్ణం అయ్యే లక్షనాలు ఉంటాయి. అందువల్ల తిన్న వెంటనే ఆహారం ఈజీగా డైసేషన్ అవుతుంది.వీటిల్లో ఫైబర్ తో పాటు ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటాయి.
Health Tips : ఒక్క గింజ తీసుకున్నా లాభమే..
ఇవి మనిషి ఆకలిని తగ్గిస్తాయి. దాంతో ఆటోమేటిక్ గా ఆహారం మితంగా తీసుకుంటాం. దీంతో చెడు కొలస్ట్రాల్ పేరుకు పోదు. అప్పుడు ఈజీగానే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన పొట్టలో ఉండే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా ఈజీగా వీటితో తగ్గిపోతాయి. వీటిల్లో ఉండే స్థూల మరియు సూక్ష్మపోషకాలు బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయంట. దాంతో మనం షుగర్ బారిన పడే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. ఇక వీటిల్లో కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఎముకలు సమృద్ధిగా ఉంటాయి.