Rain Season : వర్షాకాలంలో ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి… లేదంటే అనారోగ్యం తప్పదు…?
ప్రధానాంశాలు:
Rain Season : వర్షాకాలంలో ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి... లేదంటే అనారోగ్యం తప్పదు...?
Rain Season : వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన శరీరం వాటిని గ్రహిస్తుంది. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఆహారాలను తీసుకోవాలి. కానీ వర్షాకాలంలో ఇలాంటి ఆహారాలను తీసుకుంటే మాత్రం రోగాల బారిన పడాల్సిందే అంటున్నారు నిపుణులు. వర్షాకాలం అంటేనే వ్యాధులు సోకే సమయం. కలుషితమైన నీరు,ఆహారం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురికావాల్సి వస్తుంది. వర్షాకాలంలో తీసుకునే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు తెలుసుకుందాం…

Rain Season : వర్షాకాలంలో ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి… లేదంటే అనారోగ్యం తప్పదు…?
Rain Season ఆకుకూరలు
వర్షాకాలంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోకూడదు. కూరలు ఆరోగ్యానికి మంచివే కదా ఎందుకు తీసుకోకూడదు అనే సందేహం మీకు కలగవచ్చు. వర్షాకాలంలో మాత్రం ఇవి అంత సురక్షితమైనవి కావు అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి భూమికి చాలా దగ్గరగా పెరుగుతాయి అయితే వర్షాలు సమయంలో వరదల సమయంలో ఆకుకూరలు నీటిలో మునిగిపోతాయి దీని వలన బాక్టీరియా సంతానోత్పత్తికి ఆకుకూరలో మొక్కలు నివాసంగా ఏర్పడతాయి. ఆకుకూరలపై వివిధ సూక్ష్మజీవులు, కీటకాలు వంటివి ఆకుల వెనకాల గుడ్లు పెడుతుంటాయి. మనం సరిగ్గా శుభ్రం చేయకుండా అలాగే వండేసుకుంటే మనం అనారోగ్యానికి గురవుతాం. ఎక్కువగా తీసుకున్నట్లయితే మోషన్స్ అవుతాయి. జీర్ణ సమస్యలు వస్తాయి. ఆకుకూరలను తింటే కడుపులో ఇన్ఫెక్షన్స్, ఇంకా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువే. ఆకు కూరలని తినాలనుకుంటే,ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి ఆ తరువాతే వండుకుంటే మంచిది. ఎక్కువ సార్లు నీటిలో కడగాలి.
క్యాలీఫ్లవర్ : క్యాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో అస్సలు తీసుకోకూడదు. మీకు ఎంతో ఇష్టమైన సరే దీనికి వర్షాకాలంలో దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కీటకాలు,పురుగులు ఈ క్యాలీఫ్లవర్ ను ఆవాసంగా చేసుకుంటాయి. దీనిని తీసుకుంటే మనకు జీర్ణ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
క్యాబేజీ : క్యాబేజీ కర్రీ తో ఏ వంటకం అయినా సులభంగా చేసుకోవచ్చు. అయితే, దీనితో పకోడీ లేదా సైడ్ డిష్ క్యాబేజీ ఫ్రై చేసుకుని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇలా అసలే తినకూడదంట,ఎందుకంటే క్యాబేజీలో తేమ ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా, ఇది భూమికి దగ్గరగా ఉంటుంది.కాబట్టి, వర్షాకాలంలో దీనిని తీసుకుంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.భూమికి దగ్గరగా పెరిగే ఈ మొక్కలు చాలా అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
పుట్టగొడుగులు : అధిక తేమ కలిగిన ఆహారాలలో పుట్టగొడుగులు ఒకటి. వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణం. అందువల్ల వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తినకూడదు. దీని వల్ల ఫుడ్ పాయిజింగ్, ఎలర్జీస్ వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ వండుకొని తింటే కొనుగోలు చేసిన వెంటనే వాటిని ఉడకబెట్టాలట. అంతేకాదు, ఈ సీజన్లో క్యాప్సికం కూడా తినడం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.