Post Office Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ…!
ప్రధానాంశాలు:
Post Office Jobs : నిరుద్యోగులకు శుభవార్త... ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ...!
Post Office Jobs : ఇండియన్ పోస్టు 2024 సంవత్సరానికి పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రకటించడం జరిగింది. అయితే పదవ తరగతి కలిగినటువంటి వాళ్లకు 44,228 ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. అయితే గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్ మెంట్ పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం…
Post Office Jobs అందుబాటులో ఉన్న స్థానాలు
– బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.
– అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.
– డాక్ సేవక్.
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ GDS మొత్తం ఖాళీల సంఖ్య :
– మొత్తం పోస్ట్ లు : 44,228
– ఆంధ్రప్రదేశ్ : 1,355
– తెలంగాణ : 981
Post Office Jobs ఇండియన్ పోస్ట్ ఆఫీస్ GDS సమాచారం
-విద్య అర్హత : అభ్యర్థులు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి.
– బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం : నెలకు రూ.12,000 నుండి రూ.29,380
– అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ జీతం : నెలకు రూ.10,000 నుండి రూ.24,470
వయసు పరిమితి వచ్చి : 18 ఏళ్ల నుండి 40 ఏళ్లు ఉండాలి.
వయస్సు సడలింపు : SC/ST కి 5 ఏళ్లు ఉండగా OBC కి 3 ఏళ్లు మరియు వికలాంగులకు 10 ఏళ్లు.
ఎంపిక చేసే విధానం : అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడతారు మరియు వారి పదవ తరగతి మార్కుల నుండి పొందినటువంటి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Post Office Jobs దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ అప్లై ప్రారంభ తేదీ : 15 జులై 2024.
అప్లై చివరి తేదీ : 5 ఆగస్టు 2024.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే :
1.అధికారిక వెబ్ సైట్
సందర్శించాల్సి ఉంటుంది : అభ్యర్థులు ఇండియా పోస్ట్ GDS రిక్రూట్ మెంట్ https://www.indiapost.gov.in/ పోర్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది.
2. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ : అవసరమైన వివరాలను అందించటం వలన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయాలి.
3. అప్లోడ్ డాక్యుమెంట్స్ : పదవ తరగతి మార్కు షిట్ లు మరియు గుర్తింపు రుజువు మరియు ఇతర అవసరమైనటువంటి సర్టిఫికెట్లతో పాటు అవసరమైన పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
4. దరఖాస్తులు సమర్పించాలి : చివరి తేదీకి ముందు దరఖాస్తులను సమీక్షించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్ సైట్ అందించిన సూచనలను మరియు మార్గదర్శకాలను ఎంతో జాగ్రత్తగా చదవాలి అని సూచించారు. అలాగే వారి అన్ని అర్హత ప్రమాణాలకు కూడా అనుకూలంగా ఉన్నారు అని మరియు సమర్పణకు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రిక్రూట్ మెంట్ వారి పదవ తరగతి అకాడమీ పనితీరు ఆధారంగా పోర్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని కోరుకునే వారికి ముఖ్యమైన అవకాశాన్ని ఇస్తుంది…