Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 September 2022,8:30 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4650 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర అది. నిన్నటి ధరతో పోల్చితే రూ.50 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది. ఒక గ్రాము బంగారం 24 క్యారెట్లకు ఇవాళ రూ.5073 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.54 తగ్గింది. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ.50,730 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.540 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.51.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర 80 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.516 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.80 పెరిగింది. కిలో వెండి ధర రూ.51,600 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.800 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.580 కాగా, కిలో వెండి ధర రూ.58000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.516 కాగా, కిలో వెండి ధర రూ.51600 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది