Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది పెళ్లి అయినా.. ఇంకే శుభకార్యం అయినా సరే.. తులాలకు తులాలు బంగారం కొనాల్సిందే. ఒకప్పుడు మహిళలు మాత్రమే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. కానీ.. ఇప్పుడు పురుషులు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నారు. ధరిస్తున్నారు. అందుకే.. బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4710 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,100 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5138 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,380 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,350 కాగా, 24 క్యారెట్లకు రూ.51,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,530 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.58.30 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.583 కాగా కిలో వెండి ధర రూ.58,300 గా ఉంది. వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.637 కాగా, కిలో వెండి ధర రూ.63700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్ లో 10 గ్రాముల వెండి ధర రూ.583 కాగా, కిలో వెండి ధర రూ.58300 గా ఉంది.