Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement

Today Gold Rates : ఆగ‌స్ట్ నెల‌లో మ‌హిళ‌ల‌కు మంచి శుభ‌వార్త‌. ఇటీవ‌ల కాస్త పెరిగిన బంగారం ధ‌ర‌లు నేడు త‌గ్గాయి. దీంతో అంద‌రు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద బంగారం నిల్వలు పెరిగాయి. 2021 క్యూ2లో బంగారం ధర 705 టన్నులుగా ఉండేవి. 2022 క్యూ2కు వచ్చేసరికి ఇవి 768 టన్నులకు చేరాయి. భారత్ గత కొన్నేళ్లలో బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అయితే దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి.. రూ. 47,100కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 47,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 51,380కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,490గా ఉండేది.

Advertisement
27 July 2022 Today Gold Rates In Telugu
27 July 2022 Today Gold Rates In Telugu

Today Gold Rates : కాస్త ఉప‌శ‌మ‌నం..

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,380గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,300గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,130గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,410గాను ఉంది.కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Advertisement

ఇక వెండి విష‌యానికి వ‌స్తే.. 100 గ్రాముల వెండి రూ. 40 తగ్గి.. 5,800గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 దిగొచ్చి.. రూ. 58,000కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 58,400గా ఉండేది. ఇక దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధర ఈరోజు పైకి చేరింది. వెండి మాత్రం పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 1795 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గింది. 20.36 డాలర్లకు దిగి వచ్చింది.

Advertisement
Advertisement