Today Gold Rates : ఆగస్ట్‌లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. వరుసగా బంగారం ధర పైపైకి పోతుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మంచి ముహూర్తాలు ఉన్న సమయంలో బంగారం ధర ఇలా పైపైకి పోతుండడం వారిని కలవరపరుస్తుంది. 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి.. రూ.47,350గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర.. 270 రూపాయలు పెరిగి.. రూ.51,560గా ఉంది. ఇక వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కేజీ వేండి ధర రూ. 63,600గా ఉంది. మంగళవారంతో పోల్చుకుంటే.. 300 రూపాయలు పెరిగింది. తెలంగాణలోని మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

Today Gold Rates : పసిడి ప్రియం..
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే.. రూ.250 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 పెరిగి 51,650గా ఉంది. కేజీ వెండిపై 300 రూపాయలు పెరిగి.. రూ.63,300గా ఉంది. విశాఖపట్నం, ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 47,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,570 గా కొనసాగుతోంది. దాదాపు మిగతా నగరాల్లోనూ.. అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఈ ధరలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావంతో బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఇలా వరుసగా పెరిగితే మహిళలకు మాత్రం ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.