Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం ధ‌ర‌లు కొద్ది రోజులుగా మ‌హిళ‌ల‌కు కంటిపై క‌నుకు లేకుండా చేస్తున్నాయి. ఆగ‌స్ట్ నెల‌లో వ‌రుస‌గా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోయాయి. అయితే నేడు మాత్రం కాస్త శాంతించింది. దీంతో మ‌హిళలు నేడు బంగారం కొనేందుకు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 210 మేర దిగివచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 August 2022,9:01 am

Today Gold Rates : బంగారం ధ‌ర‌లు కొద్ది రోజులుగా మ‌హిళ‌ల‌కు కంటిపై క‌నుకు లేకుండా చేస్తున్నాయి. ఆగ‌స్ట్ నెల‌లో వ‌రుస‌గా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోయాయి. అయితే నేడు మాత్రం కాస్త శాంతించింది. దీంతో మ‌హిళలు నేడు బంగారం కొనేందుకు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 210 మేర దిగివచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. పది గ్రాములకు రూ. 200 తగ్గింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 47,150కు క్షీణించింది. ఇక వెండి రేటు రూ. 600 దిగి వచ్చింది. కేజీ వెండి రేటు రూ. 63 వేలకు తగ్గింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌..

ఆంధ్రప్రదేశ్ లోనూ బంగారం ధరలు మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,150గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే.. రూ.200 తగ్గింద. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 210 తగ్గి.. 51,440గా ఉంది. కేజీ వెండిపై 600 రూపాయలు తగ్గి.. రూ.63,000గా ఉంది. విశాఖపట్నం, ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోని ఇతర నగరాల్లోనూ బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,020గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,390 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 47,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,490 గా కొనసాగుతోంది. దాదాపు మిగతా నగరాల్లోనూ.. అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.4 శాతం మేర పైకి చేరింది. 1783 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటును చూస్తే.. సిల్వర్ ధర ఔన్స్‌కు 0.62శాతం పెరిగింది. 20 డాలర్ల పైన కదలాడుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది