Today Gold Rates : మహిళలకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates: ప‌సిడి ధ‌ర‌లు ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు షాక్ ఇస్తున్నాయి. ద్ర‌వ్యోల్భ‌ణంతో పాటు అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల వ‌ల‌న ప‌సిడి రేట్లు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇలాంటి ప‌రిస్థితిలో బంగారం కొన‌గ‌లిగేలా కూడా లేమ‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. బంగారం ధరలు ఇటీవల కాలంలో ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 5న బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం రేటు రూ. 47,500కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. పది గ్రాములకు రూ. 380 మేర పెరిగింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 51,820కు చేరింది. బంగారం ధరలు నిన్న రూ. 200 వరకు పడిపోయిన విషయం తెలిసిందే.

Advertisement
26 July 2022 Today Gold Rates In Telugu States
26 July 2022 Today Gold Rates In Telugu States

పైపైకి వెళుతున్న బంగారం..

Advertisement

ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 పెరిగి.. రూ. 47,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 47,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 పెరిగి.. రూ. 51,820కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,440గా ఉండేది. దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం రేట్లు శుక్రవారం పెరిగాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,820గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,640గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,530గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,580గాను ఉంది.

ఈ రోజు వెండి కూడా జిగేల్ మంది. సిల్వర్ రేటు ఈరోజు పైపైకి చేరింది. రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు నేడు రూ. 63,200కు చేరింది. కాగా సిల్వర్ రేటు నిన్న రూ. 600 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా చూస్తే.. వెండి ధర కూడా ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి రూ. 20 పెరిగి.. 5,770గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 57,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,500గా ఉండేది.

Advertisement