Today Gold Rates : మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates: బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న ప‌సిడి రేటు పైపైకి వెళుతుంది. ఇలా పెరుగుతూ పోతే రానున్న రోజుల‌లో బంగారం కొన‌డం కాస్త క‌ష్ట‌త‌ర‌మే అవుతుంది. ప్ర‌స్తుతం శ్రావ‌ణ మాసంలో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. కాని ఇలా బంగారం పైపైకి వెళుతున్ననేప‌థ్యంలో కాస్త ఆందోళ‌న చెందుతున్నారు. ఈ రోజు కూడా బంగారం ధర పైపైకి కదిలింది. పసిడి రేటు పెరగడం ఇది వరుసగా రెండో సారి. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 6న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
31 july 2022 today gold rates in telugu states
06 august 2022 today gold rates in telugu states

పైపైకి వెళుతున్న బంగారం ధ‌ర‌..

Advertisement

24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ. 160 మేర పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 51,980కు ఎగసింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైపైకి చేరింది. 10 గ్రాములకు రూ. 150 పెరుగుదలతో రూ. 47,650కు చేరింది. పసిడి రేటు నిన్న కూడా పెరిగింది. అంటే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు రూ. 500కు పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 47,650కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 47,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 పెరిగి.. రూ. 51,980కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,820గా ఉండేది.

కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,980గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,070గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,680గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,010గాను ఉంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి రూ. 50 పెరిగి.. 5,820గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 పెరిగి.. రూ. 58,200కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,700గా ఉండేది.

Advertisement