Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో కూడా చెప్ప‌డం క‌ష్టంగా మారింది. తాజాగా బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. 22 క్యారట్ల బంగారంతోనే ఆభరణాలు చేస్తుంటారు. నగల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.47,400కి చేరింది. నిన్నటితో పోల్చితే మరో రూ.300 పెరిగింది. హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.4,740గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరగడంతో.. ఈ ధర రూ.51,710కు ఎగిసింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు కిలోకు రూ.300 పెరిగి రూ.66,800 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

Advertisement

ఇక దేశ రాజ‌ధాని దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,770 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,200గా ఉంది. ఇక ముంబై విష‌యానికి స‌వ్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710గా ఉంది.గత మూడు వారాలుగా బంగారం ధరలు బాగా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు, డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి బంగారం ధరలకు అడ్డుకట్ట వేశాయి.

08 May 2022 today gold Rates in Telugu states
08 May 2022 today gold Rates in Telugu states

Today Gold Rates : మారుతున్న రేట్లు..

కానీ నేడు మళ్లీ ధరలు పెరిగాయి. అయితే టెక్నికల్ ఛార్ట్‌లో బంగారం, వెండి ధరలు ఓవర్‌సోల్డ్ జోన్‌లో ట్రేడవుతున్నాయని, ఏ సమయంలోనైనా భారీ మొత్తంలో షార్ట్ కవరింగ్ ర్యాలీని చూడొచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సపోర్టు లెవల్స్ వద్ద సరికొత్తగా కొనుగోళ్లకు దిగుతారని పేర్కొంటున్నారు. ఇక వెండి విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,500 ఉండగా, ముంబైలో రూ.62,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, కేరళలో రూ.66,800గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, విజయవాడలో రూ.66,800 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Advertisement