Today Gold Rates : స్థిరంగా బంగారం ధర.. వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Today Gold Rates : బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆగస్ట్ నెలలోని మొదటి రోజు బంగారం మహిళలకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కాస్త తగ్గుతుందని ఊహించిన మహిళలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అయితే బంగారం, వెండి ధరలు గత మూడు రోజుల్లో చూస్తే.. పైపైకి చేరాయని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా వెండి […]
Today Gold Rates : బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆగస్ట్ నెలలోని మొదటి రోజు బంగారం మహిళలకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కాస్త తగ్గుతుందని ఊహించిన మహిళలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అయితే బంగారం, వెండి ధరలు గత మూడు రోజుల్లో చూస్తే.. పైపైకి చేరాయని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా వెండి రేటు బాగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు బంగారం ధర తగ్గింది. వెండి రేటు మాత్రం పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) రూ. 150 పెరిగి.. రూ. 47,350కు చేరింది. ఆదివారం బంగారం ధర రూ. 47,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 170 పెరిగి, రూ.51,660కు చేరింది.
Today Gold Rates కాస్త ఉపశమనం..
క్రితం రోజు ఈ ధర రూ. 51,490గా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,490గా నమోదైంది. విజయవాడ,విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.100 పెరిగింది. ఆదివారం 48,050గా ఉన్న పది గ్రాముల బంగారం ధర సోమవారం రూ.48,150కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,530కు చేరింది. పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 47,230గాను, 24 క్యారెట్ల పసిడి రూ. 51,570గాను ఉంది.
బంగారం ధర గత నాలుగు రోజుల్లో చూస్తే.. రూ. 800కు పైగా పెరిగింది. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర ఈరోజు స్థిరంగానే ఉంది. ధరలో మార్పు లేదు.కేజీ సిల్వర్ రేటు రూ. 63,700 వద్ద కొనసాగుతోంది. వెండి ధర గత మూడు రోజుల్లో చూస్తే.. ఏకంగా రూ. 3,700 పెరిగింది. వెండి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.11 శాతం మేర దిగి వచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1779 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర రానున్న రోజుల్లో 1800 డాలర్లకు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.