Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. బంగారం కొనాలంటే నేడు గగనంగా మారింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతూ వెళ్తున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఒకప్పుడు శుభకార్యాల్లో బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించేవారు కాదు కానీ నేడు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం.. ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని రోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టినా.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి.

Advertisement
08 May 2022 today gold Rates in Telugu states
08 May 2022 today gold Rates in Telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారానికి ఒక గ్రాముకు ఇవాళ ధర రూ.4645 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.75 తగ్గింది. 10 గ్రాముల బంగారానికి 22 క్యారెట్లకు ధర రూ.46450 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.750 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు ఇవాళ ధర రూ.5067 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ రూ.82 తగ్గింది. 10 గ్రాములకు ధర రూ.50670 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 గ్రాములకు రూ.820 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,640 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51970 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,450 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.47,640 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,970 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,450 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉండేది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,450 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉండేది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,450 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,450 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,450 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,670 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాముకు రూ.58.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఒక గ్రాముకు రూ.2.10 పైసలు తగ్గింది. 10 గ్రాములకు ఇవాళ ధర రూ.587 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ. 21 తగ్గింది. కిలో బంగారం ధర ఇవాళ రూ.58,700 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.2100 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.634 కాగా.. కిలో వెండి ధర రూ.63400 గా ఉంది. ముంబైలో 10 గ్రాములకు రూ.587 కాగా.. కిలో వెండి ధర రూ.58700 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 587 కాగా.. కిలో వెండి ధర రూ.58700 గా ఉంది. కోల్ కతాలో 10 గ్రాములకు రూ.634 కాగా.. కిలో వెండి ధర రూ.63400గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.634 కాగా.. కిలో వెండి ధర రూ.63400 గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.634 కాగా.. కిలో వెండి ధర రూ.63400 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

Advertisement