Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మాత్రం మహిళలకు బంగారం, వెండి ధరలు శుభవార్త చెప్పాయి. బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇవాళ ఏకంగా బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.

Advertisement

08 May 2022 today gold Rates in Telugu states

22 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4775 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5208 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,080 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,190 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,080 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,110 గా ఉంది. కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,080గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,080 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,080 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.61 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.610 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. కిలో వెండి ధర రూ.61,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.663 కాగా.. కిలో వెండి ధర రూ.66300 గా ఉంది.

Advertisement