Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. నిన్న ఏకంగా బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

24 april 2022 today gold rates in telugu states

22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5198 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,980 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,010 గా ఉంది. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.610 గా ఉంది. కిలో వెండి ధర రూ.61000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.610 కాగా.. కిలో వెండి ధర రూ.61000 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.663 కాగా.. కిలో వెండి ధర రూ.66300 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది