Today Gold Rates : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులో పాటు దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన నేపథ్యంలో భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం చాలా కష్టంగా మారింది. అందుకే బంగారం ధర తగ్గినప్పుడే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుక్కోవడం బెటర్. నిన్నటితో (24-07-2022 ఆదివారం) పోలిస్తే బంగారం ధరల్లో ఈరోజు ఏ మార్పు లేదు. ఈరోజు (25-07-2022 సోమవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.46,900 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.
బంగారం ధర గత రెండు రోజుల్లో దాదాపు రూ. 1000 మేర పెరిగిన విషయం తెలిసిందే. సిల్వర్ రేటు కూడా ఈ రోజు స్థిరంగా ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. కాగా వెండి రేటు నిన్న రూ. 400 మేర పడిపోయింది. పసిడి రేటు గత వారం రోజుల్లో చూస్తే కొంత మేర కోలుకుందని చెప్పుకోవచ్చు. డాలర్ బలహీనపడటం, ట్రెజరీ ఈల్డ్ తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా కొనసాగుతోంది. వెండి రేటు 1కేజీ రూ.61,200గా ఉంది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి.

Today Gold Rates : ఎలాంటి మార్పులు లేవు..
విజయవాడ మార్కెట్ లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం తులం రూ.51,160గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర రూ.61,200గా కొనసాగుతోంది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.46,900గా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.51,160గా ఉంది. ఢిల్లీలో వెండి రేటు 1కేజీ రూ.55,100గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబై, తూర్పున ఉన్న కోల్ కతాలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 55,100గా ఉంది.