Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4745 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5176 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.23 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.230 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,530 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా.. కిలో వెండి ధర రూ.60000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా… కిలో వెండి ధర రూ.66000గా ఉంది.