Today Gold Rates : మహిళలకు షాకిచ్చిన పసిడి.. తగ్గిన వెండి, బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఇవాళ కూడా బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.

Advertisement

08 May 2022 today gold Rates in Telugu states

Advertisement

ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.4755 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,550 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5187 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,870 గా ఉండగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.59.80 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.598 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. కిలో వెండి ధర రూ.59,800 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.657 కాగా.. కిలో వెండి ధర రూ.65700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.598 కాగా.. కిలో వెండి ధర రూ.59800 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.657 కాగా.. కిలో వెండి ధర రూ.65700 గా ఉంది.

Advertisement