Today Gold Rates : వరుసగా మరోసారి షాకిచ్చిన పసిడి.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : వరుసగా మరోసారి షాకిచ్చిన పసిడి.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 May 2022,9:00 am

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న, నిన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

ఇవాళ ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4790 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5225 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,250 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,770 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు పెరిగింది. 10 గ్రాములకు రూ.620 గా ఉంది. 4 రూపాయలు పెరిగింది. కిలో వెండి మీద రూ.62000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 10 గ్రాముల వెండి ధర రూ.665 కాగా.. కిలో వెండి ధర రూ.66500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది