Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఇటీవల బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో నేడు మళ్లీ తగ్గాయి. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. మరి కొద్ది రోజులలో మంచి ముహూర్తాలు ఉండనుండగా, వరుస పెళ్లిళ్లు ,ఫంక్షన్స్ మొదలు కాబోతున్నాయి. వాటి కోసం మహిళలు భారీగా బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే బంగారం ధరలు ఇలా తగ్గుతుండడం వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. జూలై 27న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 దిగి వచ్చింది. దీంతో బంగారం రేటు 10 గ్రాములకు రూ. 50,780కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇదే దారిలో పయనించింది. రూ. 320 పడిపోయింది.
బంగారం రేటు గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 300 పడిపోయింది. దీంతో సిల్వర్ రేటు రూ. 60,800కు తగ్గింది. వెండి ధర గత నాలుగు రోజుల్లో రూ. 800 మేర పడిపోయింది. బంగారం వెండి కొనాలని చూసే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,580గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,780గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 60,800 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది.

Today Gold Rates : కాస్త ఉపశమనం..
చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,280గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,580గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,580గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,580గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,780గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,580 వద్ద కొనసాగుతోంది.