Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఓవైపు డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. ఈ రెండు ప్రస్తుతం బంగారం ధరను ఆకాశానికి ఎక్కేలా చేశాయి. అందుకే.. ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధరలు పెరిగి వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.4765 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.5198 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. కోల్ కతా, బెంగళూరులోనూ అదే ధర ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే వెండి ఒక గ్రాము ధర ఇవాళ రూ.60.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.603 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 గా ఉంది. కిలో వెండి ధర రూ.60,300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.