Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. ఇన్నాళ్ల కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వరుసగా నాలుగోసారి కూడా ఫెడ్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. దీంతో ఇన్వెస్టర్ల అంచనాలు బలపడ్డాయి. ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా ఉపయోగించే బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇంకా ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. దీంతో పసిడి రేటు ఒక్కసారి దూసుకుపోతోంది. […]
Today Gold Rates : మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. ఇన్నాళ్ల కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వరుసగా నాలుగోసారి కూడా ఫెడ్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. దీంతో ఇన్వెస్టర్ల అంచనాలు బలపడ్డాయి. ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా ఉపయోగించే బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇంకా ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. దీంతో పసిడి రేటు ఒక్కసారి దూసుకుపోతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,380గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
Today Gold Rates : పసిడి పైపైకి..
మిగతా నగరాలలో గమనిస్తే.. ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) రూ. 650 పెరిగి.. రూ. 47,100కు చేరింది. గురువారం బంగారం ధర రూ. 46,450గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 700 పెరిగి.. రూ. 51,380కి చేరింది.కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 51,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,670గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,000గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 47,130గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,410గాను ఉంది…
ఇక వెండి ధరలు కూడా శుక్రవారం పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1,900 పెరిగి.. రూ. 56,500కు చేరింది. గురువారం ఈ ధర రూ. 54,600గా ఉండేది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 61,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాల్ 56,500.. బెంగళూరులో 61,200.. ముంబైలో 56,500.. చెన్నైలో 61,200గా ఉన్నాయి.ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో మహిళలు షాక్ లో ఉన్నారు. శ్రావణ మాసం పండుగ సమయానికి ఇలా బంగారం ధరలు పెరగడం కొందరిని కలవరపరుస్తుంది. రానున్న రోజులలో ఏమైన తగ్గుతాయా అనేది చూడాలి.