Today Gold Rates : కొద్ది రోజులుగా బంగారం, వెండి రేట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మరింత పెరగడం, ఆ తర్వాత ఆ తగ్గడం వంటివి జరుగుతుంది. అయితే శనివారం బంగారం ధరలు భగ్గుమన్నాయి. దీంతో పసిడి ప్రియులకి పెద్ద షాక్ తగిలినట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) రూ. 100 పెరిగి.. రూ. 47,200కు చేరింది. శుక్రవారం బంగారం ధర రూ. 47,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 110 పెరిగి.. రూ. 51,490కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 51,380గా ఉండేది.

Today Gold Rates : పసిడి పైపైకి..
గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.810 మేర పెరగడం పసిడి ప్రియులకు షాక్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి రేటు గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం అనూహ్యంగా రూ.2500 మేర పెరగడం గమనార్హం. విజయవాడ మార్కెట్ లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం (10 గ్రాములు) రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 పెరిగి, తులం రూ.51,490గా ఉంది. ఇక్కడ కూడా వెండి రేటు రూ.1100 పెరిగి, 1కేజీ రూ.62,300 అయింది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.
హైదరాబాద్ లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం (10 గ్రాములు) రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 పెరిగి, తులం రూ.51,490కి చేరింది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు రూ.1100 పెరిగి, 1కేజీ అత్యధికంగా రూ.62,300కు ఎగిసింది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి . దేశంలో వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1,500 పెరిగి.. రూ. 58,000కు చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,500గా ఉండేది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 62,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాల్ 58,000.. బెంగళూరులో 62,300.. ముంబైలో 58,000.. చెన్నైలో 62,300గా ఉన్నాయి.