Today Gold Rates :ప‌సిడి ధ‌ర‌లు పైపైకి.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates :ప‌సిడి ధ‌ర‌లు పైపైకి.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Today Gold Rates :ఇటీవ‌ల స్త్రీలు బంగారంపై ఎక్కుగా మోజు చూపిస్తున్నారు. ఏదైన ఫంక్ష‌న్ కి వెళ్లాలంటే ఒంటి నిండా బంగారం దిగేయాల్సిందే. ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నా కూడా బంగారం కొనుగోలు చేయాల్సిందే అంటున్నారు మ‌హిళ‌లు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు క‌నిపిస్తున్నాయి. వ‌రుస‌గా త‌గ్గ‌డం, ఆ వెంట‌నే పెర‌గ‌డం క‌నిపిస్తుంది. శుక్ర‌వారం కాస్త తగ్గిన బంగారం ధ‌ర శనివారంకి వ‌చ్చే స‌రికి పైపైకి వెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 July 2022,9:26 am

Today Gold Rates :ఇటీవ‌ల స్త్రీలు బంగారంపై ఎక్కుగా మోజు చూపిస్తున్నారు. ఏదైన ఫంక్ష‌న్ కి వెళ్లాలంటే ఒంటి నిండా బంగారం దిగేయాల్సిందే. ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నా కూడా బంగారం కొనుగోలు చేయాల్సిందే అంటున్నారు మ‌హిళ‌లు. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు క‌నిపిస్తున్నాయి. వ‌రుస‌గా త‌గ్గ‌డం, ఆ వెంట‌నే పెర‌గ‌డం క‌నిపిస్తుంది. శుక్ర‌వారం కాస్త తగ్గిన బంగారం ధ‌ర శనివారంకి వ‌చ్చే స‌రికి పైపైకి వెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 46,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 పెరిగి.. రూ. 50,620కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,180గా ఉండేది.

24 april 2022 today gold rates in telugu states

ప‌సిడి ప్రియం..

దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లో బంగారం ధ‌ర‌లు ప‌రిశీలిస్తే .. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,420గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,640గాను ఉంది. ఇక హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

గడిచిన మూడు వారాలుగా మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల కారణంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం, అంతే స్థాయిలో పతనం కావడం, మళ్లీ పైపైకి కదలడం సాధారణంగా మారింది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ రూ.80కి పడిపోయిన తర్వాత బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి విష‌యానికి వ‌స్తే దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ. 200 తగ్గి.. రూ. 55,400గా ఉంది. శుక్రవారం ఈ ధర రూ. 55,600గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 61,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాల్​ 55,400.. బెంగళూరులో 61,600.. ముంబైలో 55,400.. చెన్నైలో 61,600గా ఉన్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది