Viral Video : బుల్లెట్ బండి పాటకు పెళ్లికొడుక్కే చుక్కలు చూపించిన పెళ్లికూతురు
Viral Video : బుల్లెట్ బండి సాంగ్ ఏమంట వచ్చిందో నాటి నుంచి ఫంక్షన్ ఏదైనా, ఈవెంట్ ఎక్కడైనా ఇదే సాంగ్ వినిపిస్తోంది. ఇంకొన్ని డేస్ వింటే దీని మీద నిజంగానే బోర్ కొడుతుంది. కానీ నేటితరం జనాలు బుల్లెట్ బండిసాంగ్ మీద మనసు పారేసుకున్నారని అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఒకప్పుడు జానపద పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగిన ఈ పాటలే మార్మోగేవి. కానీ ఇప్పుటి జనాలకు బుల్లెట్ బండి ఫీవర్ పట్టుకుంది. ఈ మధ్యకాలంలో వివాహాలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు అమ్మాయి, అబ్బాయి తరఫు వారు.
కొందరు సంగీత్ పెట్టించుకుంటుంటే డబ్బులు తక్కువగా ఉన్న వారు డీజే సౌండ్స్ పెట్టుంచుకుని మరీ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తమకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేయడం కోసం బుల్లెట్ బండి పాటకు డ్యాన్సులు వేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక పెళ్లయ్యాక బారాత్ టైంలో అమ్బాయి, అబ్బాయి తరఫు బంధువులు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు, పెద్దలు బారాత్‌లో సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో పెళ్లికూతుర్లకు ఎలాంటి పరిమితులు విధించకపోవడంతో వారు స్వేఛ్చగా తమకు నచ్చిన విధంగా చేస్తూ వెళ్తున్నారు. రీసెంట్‌గా ఓ పెళ్లి వేడుక పూర్తయ్యాక…

bride Dance bullet bandi song video
Viral Video : పెళ్లికొడుకుని ముప్పు తిప్పలు పెట్టింది..
రీసెప్షన్ టైంలో పెళ్లికూతురు అబ్బాయికి నిజంగానే షాక్ ఇచ్చింది. బుల్లెట్ బండి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకును ముప్పు తిప్పలు పెట్టింది. ఓ వైపు పెళ్లికొడుకు ఇబ్బంది పడుతుంటే అతని చేయి పట్టుకుని మరీ డ్యాన్స్ చేసేవరకు విడిచిపెట్టలేదు. అబ్బాయి డ్యాన్స్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటే పెళ్లికూతురు మాత్రం అవేమి పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా చేస్తోంది. ఒకానొక సందర్బంలో అమ్మాయే అబ్బాయి లాగా.. అబ్బాయి అమ్మాయిలా వలే నేటితరం యూత్ ప్రవర్తన ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లికూతురి డ్యాన్స్ గురించే జనాలు ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు.
