Home » Amaravathi » Ap It Minister Gowtam Reddy Released Polycet Results
amaravathi

Amaravati..ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ విడుదల

Authored By
praveen T
The Telugu News | Published on: September 15, 2021, 1:49 pm
Advertisement

ఏపీ పాలిసెట్-2021 ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్‌ను ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం అమరావతిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 81వేల మంది విద్యార్థులకు రూ.128 కోట్లు అందజేశామని తెలిపారు. 72 వేల మంది విద్యార్థులకు రూ.54 కోట్లు ‘జగనన్న వసతి దీవెన’గా అందించామని చెప్పారు. విద్యకు తమ సర్కారు ప్రయారిటీ ఇస్తున్నదని వివరించారు. ఇకపోతే పాలిసెట్ రిజల్ట్స్‌లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా శ్రీకాకుళం నిలిచింది.

Advertisement

అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా నెల్లూరు ఉందని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.

Advertisement

 

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి