Home » Andhra Pradesh » Ap Deputy Cm Kottu Satyanarayana Comment About Ys Jagan
andhra pradesh

YS Jagan : జగన్ మళ్ళీ CM అయిన వెంటనే జరిగేది ఇదే !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: July 20, 2023, 12:00 pm
Advertisement

YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ, జనసేన మధ్య తీవ్రవైన మాటల యుద్ధం నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే.. వారాహి యాత్ర పేరుతో రచ్చ రచ్చ చేస్తున్నారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ని విమర్శించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. పవన్ వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ భగ్గుమన్నారు.

Advertisement

2024 లో సీఎం జగన్ ఖచ్చితంగా గెలుస్తారు.. గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తారో కూడా చెప్పుకొచ్చారు సత్యనారాయణ. ఏపీలో 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎంగా గెలిచాక.. కొన్ని అకౌంట్లు సెటిల్ చేస్తారని కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించిన కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. జగన్ తిరిగి గెలిచిన తర్వాత కొందరి లెక్కలు సెట్ చేస్తారని పవన్ గురించే ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు.

ys jagan Fans Big News

Advertisement

YS Jagan : పవన్ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలుసు

పవన్ కళ్యాణ్ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు అండ చూసుకొని పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ ను తిడితే అది ఊరికే పోదు. ఎవరినైనా ఆయన పాతాళంలోకి తొక్కేస్తారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో ధర్మం గెలువబోతోంది. మళ్లీ హిస్టరీ రిపీట్ అవబోతోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి