Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్యత్..చంద్రబాబు నాశనం చేస్తున్నాడు.. అసదుద్దీన్ సంచలన కామెంట్స్
Asaduddin Owaisis : సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని ఓవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం పగ్గాల్ని మరోవైపు మోస్తున్న నారా చంద్రబాబు నాయుడిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచన చేశారు. ముఖ్యంగా పార్టీ పగ్గాల విషయంలో లోకేష్ కు మద్దతుగా ఓవైసీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్యత్..చంద్రబాబు నాశనం చేస్తున్నాడు.. అసదుద్దీన్ సంచలన కామెంట్స్
చంద్రబాబు తన కంటే, తన పార్టీ కంటే లోకేష్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎలాగో తన తర్వాత కుమారుడు లోకేషే పార్టీ పగ్గాలు తీసుకుంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పదవికి పోటీ రాడు కదా అని ఓవైసీ వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ నుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తుండగా.. ఆయన అంత పాపులరా అని ఓవైసీ వారిని ప్రశ్నించారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అని, గతంలో సీఎంగా తొమ్మిదేళ్లు, విపక్ష నేతగా పదేళ్లు పనిచేశారని గుర్తుచేశారు.
అటువంటి వ్యక్తి లోకేష్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ సూచించారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్న లోకేష్ కు చంద్రబాబుకు ఆటోమేటిక్ వారసుడిగా ఇప్పటికే పేరు వచ్చేసింది. అదే సమయంలో ఆయన కాబోయే సీఎం అనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన సూచన చంద్రబాబు పట్టించుకుంటాడా అనేది చూడాలి..
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.