Ys Jagan : రైతు సమస్యలు పట్టింకుకోరా... కూటమి సర్కార్ పై అన్నా చెల్లెలు ఫైర్..!
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కనీస మద్దతు లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Ys Jagan : రైతు సమస్యలు పట్టింకుకోరా… కూటమి సర్కార్ పై అన్నా చెల్లెలు ఫైర్..!
పెప్పర్, పత్తి, జొన్న, కందులు, మినుములు, టమోటా, అరటి, పొగాకు వంటి పంటలకు కనీస ధరలు లభించకుండా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని , మిర్చి రైతులను నమ్మించి కేంద్రం ద్వారా నాఫెడ్ కొనుగోలు చేస్తుందని చెప్పి, చివరికి ఒక్క క్వింటాలైనా కొనకుండా రైతులకు నష్టాలూ, తెచ్చారని జగన్ విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆ విధానాన్ని కొనసాగించినా, రైతులకు కాస్త ఊరట లభించేదన్నారు.
బడ్జెట్‌లో కేవలం 300 కోట్ల రూపాయలే కేటాయించడం విడ్డూరంగా ఉందని, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చయిన ఆధారాలున్నాయా? అని జగన్ ప్రశ్నించారు. ధాన్యం, కోకో, ఆక్వా, పొగాకు రైతులు ఆందోళనల్లో ఉండగా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల సంక్షోభం పెరుగుతుందని, లక్షల మంది రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల పక్షాన నిలవాలని జగన్ డిమాండ్ చేశారు.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.