Chandrababu : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సర్కార్ గిఫ్ట్ అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ అడిషనల్ ఎస్పీగా ఇటీవల పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఓఎస్డీగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డీజీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభాకర్ నాయుడు సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో సేవలందించారు. ఇటీవల ఆయన పదవీ విరమణ చేయగా.. ఆయన సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వం తిరిగి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఓఎస్డీగా నియమించింది. అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీగా ఉండగా అడిషనల్ ఎస్పీగా ఇటీవల ప్రమోషన్ దక్కింది.. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఓఎస్డీ నియమించింది.
ఈ పరిణామంతో కింజరాపు కుటుంబం పట్ల చంద్రబాబుకు ఉన్న అభిమానం మరోమారు అంతా చర్చించుకుంటున్నారు. కింజరాపు కుటుంబం పార్టీకి నిబద్ధతతో చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు వారిని సముచితంగా గుర్తింపు ఇచ్చి ఆదరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడుకు అవకాశం కల్పించడం ద్వారా బాబు బాబు ఆ ఫ్యామిలీకి ఇస్తున్న విలువ ఏంటో చెప్పారు.
LPG Gas : కొత్త సంవత్సరంలోకి అడుగిన సందర్భంగా జనవరి 1, 2025 నుండి భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన…
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు…
Cycling : ప్రస్తుత కాలంలో మానవాళి జీవితంలో ఒత్తిడితోను బిజీ అయిపోతున్నారు, అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేదు. కూర్చున్న…
Rohit Sharma : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న తర్వాత టీమిండియా తో పాటు కెప్టెన్ Rohit Sharma…
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు శ్రీ తేజను నటుడు అల్లు అర్జున్ మంగళవారం…
Sankranti Movies : ప్రతి శుక్రవారం థియేటర్ లో సినిమాలు.. OTTలో వెబ్ సీరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఐతే…
Gajakesari Yoga : జ్యోతిష్య శాస్త్రం Gajakesari Yoga ప్రకారం నవగ్రహాలు మనుషులు తమ జీవితంలో చేసిన కర్మ ఫలాలను,…
Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు…
This website uses cookies.