Home » Andhra Pradesh » Fake Videos Will Make You Happy Roja Fire
andhra pradesh

Minister RK Roja : ఫేక్ వీడియోలతో శునకానందం పొందుతారు.. రోజా ఫైర్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 7, 2024 8:59 pm
Advertisement

Minister RK Roja : ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం సాగుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలకు రెబల్స్ బెడద పట్టుకుంది. ఎన్నికల్లో చాలా మంది టికెట్లు ఆశిస్తుంటారు. అయితే ఎవరికి వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇక టికెట్ రాని వారు కొన్ని సార్లు వేరే పార్టీలకు వెళ్తుంటారు. ఇంకొందరు మాత్రం రెబల్స్ గానే పోటీ చేయడానికి ఇష్టపడుతుంటారు. కాగా ఇప్పుడు నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి రోజా కూడా ఇప్పుడు రెబల్స్ బెడద పట్టుకుందని అర్థం అవుతోంది. ఆమె తాజాగా నగరిలో మాట్లాడుతూ రెబల్స్ మీద మండిపడ్డారు. మొన్నటి వరకు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు వద్దని వెళ్లిపోవడం వెనక పెద్ద కుట్ర ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

సంపాదించుకున్నది సరిపోక..

మొన్నటి వరకు పదవులు అనుభవించి, క్వారీల్లో దోచుకుని అక్రమంగా సంపాదించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా సంపాదించుకున్నది సరిపోక ఇప్పుడు టీడీపీ లో చేరి జగనన్నను తిడుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. అంతే కాకుండా ఇప్పుడు సంపాదించుకున్నది సరిపోక తనను వెన్నుపోటు పొడిచారని మంత్రి రోజా ఆరోపించారు. తను వారి అక్రమాలకు అడ్డుంగా మారుతున్నాననే భయంతో వారంతా కలిసి ఇప్పునడు నగరి టీడీపీ అభ్యర్ది గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే నగరిని అభివృద్ధి చేసింది తానే కాబట్టి ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేయాలంటూ పిలుపునిచ్చారు ఆర్కే రోజా.

Advertisement

ఒక వ్యక్తిని ఇంత మంది విమర్శిస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవాలని కోరారు. గతంలో తనకు టిక్కెట్ రాదని, రెబల్స్ వల్ల ఓడిపోతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేసి, అవి ఫెయిల్ అవ్వడంతో.. ఇప్పుడు ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఫేక్ వీడియోలతో కొందరు శునకానందం పొందుతున్నారు తప్ప వారికి ఒరిగేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రోజా ఆమె నియోజకవర్గం మొత్తం తిరుగుతోంది. ఆమె భర్త ఇంకోవైపు తిరుగుతున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా ఇంకోసైడ్ ప్రచారం కల్పిస్తున్నారు. ఈ సారి తాను గెలవడం పక్కా అని మరోసారి చెబుతున్నారు రోజా.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి