Home » Andhra Pradesh » Farmers Government Assures To Procure Every Soaked Grain Of Padd
andhra pradesh

Farmers : రైతుల‌కి ప్ర‌భుత్వం అందించిన శుభ‌వార్త‌తో ఫుల్ హ్యాపీ

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 6, 2025, 10:00 am
Advertisement

Farmers  : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి రైతులు ఇబ్బంది పాలువుతున్నారు. భారీ వర్షాలు పడడంతో పంట పూర్తిగా నీటిలో తడిసింది. తడి వలన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి ధాన్యం విక్రయించగలిగే స్థితి కూడా లేదు. దీంతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.

Advertisement

Farmers : రైతుల‌కి ప్ర‌భుత్వం అందించిన శుభ‌వార్త‌తో ఫుల్ హ్యాపీ

Farmers  శుభ‌వార్త‌..

దీనిపై ఏపీ ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి స్పందించారు. తక్షణం ఆ శాఖ మంత్రిని ఆ ప్రాంతానికి పంపించారు. గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. జగ్గంపేట మండలంలో దెబ్బతిన్న వరి పంటలను, తడిసిపోయిన ధాన్యాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పరిశీలించారు. అయితే ప్రభుత్వం తరఫున ఆయన మాటిచ్చారు,

Advertisement

ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మధ్య వ్యక్తులు తక్కువ ధరల కోసం మీ దగ్గరికి వచ్చినా అమ్మవలసిన అవసరం లేదు అని ఆయ‌న అన్నారు. ప్రభుత్వం మీ బాధ్యత తీసుకుంటుంది అని చెప్ప‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.మ‌ ఇప్పటివరకు పంట అంతా ఏమై పోతుందా అని ఆలోచించిన రైతులకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చెప్ప‌డంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి