Home » Andhra Pradesh » Gas Cylinder Subsidy Not Credited What Is The Reason
andhra pradesh

Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండ‌ర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో ప‌డ‌లేదా.. కార‌ణం ఏంటంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 22, 2025, 6:00 pm
Advertisement

Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచిత వంట గ్యాస్ సిలిండర్, స్టౌవ్ వంటివి అందిస్తున్న క్రమంలో మారుమూల గ్రామాల ప్రజలు సైతం సిలిండర్ ఉపయోగిస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దీపం’ పథకం కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ డబ్బులు విడుదల చేస్తోంది. కాని కొంతమంది లబ్ధిదారులకు ఈ డబ్బులు సకాలంలో జమ కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.

Advertisement

Gas Cylinder Subsidy : టెన్ష‌న్ అక్క‌ర్లేదు..

ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాక‌పోవ‌డానికి సాంకేతిక లోపాలు ప్రధాన కారణం. ముఖ్యంగా రెండో విడత సిలిండర్లకు సంబంధించిన రాయితీ డబ్బులు విడుదల చేయడంలో ఇవి తలెత్తాయి. మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోవడం లేదా KYC ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కూడా డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతుంది.

Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండ‌ర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో ప‌డ‌లేదా.. కార‌ణం ఏంటంటే..!

Advertisement

తొలి విడతలో డబ్బులు పొందిన వారందరికీ రెండో విడత రాయితీ డబ్బులు తప్పకుండా అందుతాయి. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిధుల విడుదల ఆలస్యమైందని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ముందు కేవైసీ ప్ర‌క్రియ వెంట‌నే పూర్తి చేసుకుంటే మీ ఖాతాలో గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. సాంకేతిక సమస్యలు పరిష్కారమై, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు అందుతాయని అధికారులు చెబుతున్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి