Home » Andhra Pradesh » Gudivada Amarnath Key Comments On Chandrababu Singapore Tour
andhra pradesh

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 2, 2025, 2:10 pm
Advertisement

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారని అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనల వెనుక అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవాలనే ఉద్దేశం ఉందని అమర్‌నాథ్ సంచలన ఆరోపణలు సంధించారు.

Advertisement

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ జీరో – కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ లేదని అమర్‌నాథ్ఇవి సాధారణ పర్యటనలు కావని, ఆర్థిక లావాదేవీల కోసమే ఇన్నిసార్లు అక్కడికి వెళ్లారని ఆయన పరోక్షంగా సూచించారు.అంతేకాకుండా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ లేదని అమర్‌నాథ్ విమర్శించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను అమర్‌నాథ్ ప్రస్తావించారు.

Advertisement

“అదానీ డేటా సెంటర్ వైసీపీ హయాంలోనే వచ్చింది. లోకేశ్ చెబుతున్న బ్లూ ఎకానమీకి వైసీపీ పాలనలోనే అంకురార్పణ జరిగింది” అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దూషణలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి