Home » Andhra Pradesh » Husband Murdered With Boyfriend After Watching Web Series
andhra pradesh

Kurnool : దారుణం .. వెబ్‌ సిరీస్ చూసి .. ప్రియుడితో కలిసి భర్త హత్య ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 27, 2026, 10:00 pm
Advertisement

Kurnool : వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని ఛిద్రము చేయడమే కాకుండా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన భార్య, తన ప్రియుడితో కలిసి క్రూరమైన హత్యకు పాల్పడింది. వెబ్‌సిరీస్‌లలో చూసిన విధానాన్ని అనుసరించి హత్యకు పథకం రచించడం ఈ కేసులో కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ శివారులో ఈ నెల 23న కాలిన మృతదేహం కనుగొనబడింది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కొద్ది రోజుల్లోనే హత్య వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు. ఎమ్మిగనూరుకు చెందిన పద్మకు, పెద్దనెలాటూరు గ్రామానికి చెందిన నరేంద్రతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే నరేంద్ర పని నిమిత్తం తరచూ బయటకు వెళ్లడంతో పద్మ అదే గ్రామానికి చెందిన వంశీతో వివాహేతర సంబంధం కొనసాగించింది.

Advertisement

Husband murdered with boyfriend after watching web series

ఈ విషయం తెలుసుకున్న నరేంద్ర పలుమార్లు భార్యను మందలించాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తర్వాత కుటుంబాన్ని ఎమ్మిగనూరుకు మార్చినా పరిస్థితి మారలేదు. భర్త పనికి వెళ్లినప్పుడు ప్రియుడిని ఇంటికి పిలుచుకోవడం కొనసాగించింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగి చివరకు విడాకుల దాకా వెళ్లింది. అయితే నరేంద్ర మాత్రం కాపురం కొనసాగించాలని కోరుకున్నాడు. ఇదే సమయంలో భర్త ఉన్నంతకాలం తన సంబంధం కొనసాగదని భావించిన పద్మ, ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. పథకం ప్రకారం నిద్రిస్తున్న నరేంద్రను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని గ్రామ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. మరుసటి రోజు గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Advertisement

 

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి