Home » Andhra Pradesh » Jagan Minister Kannababu Shocking Comments On Cm Ys Jagan Mohan Reddy
andhra pradesh

Ys jagan : ఎన్ని జన్మలు ఎత్తినా.. జగన్ లాంటి సీఎంను మాత్రం చూడలేం.. ఆ మంత్రి షాకింగ్ కామెంట్స్ వైరల్?

Authored By
Himanshi
The Telugu News | Updated on: January 23, 2021, 3:22 pm
Advertisement

Ys jagan :  వైకాపా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ పై చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని సార్లు ఆ పార్టీ నాయకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జగన్‌ ను దేవుడు అని రాముడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ను దేవుడిగా కొలిచినా కూడా తప్పు లేదు అంటూ కొందరు వైకాపా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరో మంత్రి కూడా జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మరింత అతిశయోక్తి కలిగించే వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ను ఇంప్రెస్ చేసేందుకు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైకాపా నాయకులకు అలవాటు అయ్యింది. అదే సమయంలో జగన్ ను జనంలోకి తీసుకు వెళ్లేందుకు ఇదే మంచి మార్గం అన్నట్లుగా కూడా ఉంది. కొడాలి నాని ఇప్పటికే జగన్ ను ఆకాశమే హద్దుగా ప్రశంసలతో ముంచెత్తుతూ ఉన్నాడు. ఎవరైనా జగన్ ను విమర్శిస్తే వారిని కొట్టేందుకు కూడా సిద్దం అంటాడు.

Advertisement

minister kannababu shocking comments on cm ys jagan mohan reddy

ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి సీఎం దొరకడు: Ys jagan

మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి ముఖ్య మంత్రి ఎక్కడ ఉండి ఉండడు. ఎందుకంటే రేషన్‌ బియ్యంను ఏకంగా ఇంటికి పంపించే సీఎం మన సీఎం. ప్రతి కార్యక్రమంను కూడా జనాల కోసం చేసేందుకు ముందుకు వస్తున్నాడు. ప్రతి రోజు కూడా జనాల గురించి ఆలోచించడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా తీసుకు వచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి సీఎం ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఏపీ ప్రజలకు దొరకడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. దేశంలోనే అత్యుత్తమ సీఎంగా జగన్ మోహన్‌ రెడ్డి ఉన్నారు. దేశం మొత్తం కూడా ఆయన్ను చూస్తుందని, ఆయన పాటిస్తున్న పద్దతులను పాటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఏపీ ప్రజలు అదృష్టం చేసుకున్నారు: kannababu

ఏపీకి జగన్ సీఎం అవ్వడం జనాల అదృష్టం అంటూ మంత్రి కన్నబాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం వల్లే అప్పుడు రాజన్న ఇప్పుడు జగనన్న సీఎం అయ్యారు. వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు అంటూ మంత్రి చెప్పుకొచ్చాడు. వైకాపాలో ఈ వ్యక్తి పూజ మరీ ఎక్కువ అయ్యిందనే విమర్శలు ఈ మద్య ఎక్కువ వస్తున్నాయి. అయినా కూడా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు జగన్‌ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన్ను దేవుడు అంటూ ప్రసంసించడం కామన్‌ అయ్యింది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి