Kanna Rajini : కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా.. జనసేన మహిళ నేత వీడియో వైరల్
Kanna Rajini Comments : ఏపీ రాజకీయాల్లో కులాల ప్రస్తావన, నేతల వ్యాఖ్యలు కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. జనసేన మహిళా నేత కన్నా రజిని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ మహిళా అధికార ప్రతినిధి కన్నా రజిని గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిల పట్ల ఇతర కులాల అమ్మాయిలు ఆకర్షితులవుతారని చెబుతూ, ఆమె వాడిన భాష ఇప్పుడు వివాదాస్పదమైంది. “కాపు అబ్బాయిల వెనుక ఇతర కులాల అమ్మాయిలు కుక్కల్లా పడతారు” అని ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి రంగా, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రముఖుల వివాహాలను ఉదాహరణగా చూపిస్తూ ఆమె చేసిన ఈ విశ్లేషణ, ఒక వర్గాన్ని అతిగా పొగుడుతూ ఇతర వర్గాలను కించపరిచేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kanna Rajini Comments : కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా.. జనసేన మహిళ నేత వీడియో వైరల్
అంబటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తుండి పోయారు !
కేవలం పాత వీడియోనే కాకుండా, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ మరియు ఆయనపై జరిగిన దాడుల విషయంలో కూడా కన్నా రజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మానికి విరుద్ధంగా ఆమె పోలీసుల తీరును తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. అంబటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం సరికాదని, పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ శాసిస్తోందని ఆమె ఆరోపించారు. తాను జనసేన అధికార ప్రతినిధి పదవి నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పినప్పటికీ, పార్టీ లైన్ దాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూటమిలో చిచ్చు పెట్టింది.
కన్నా రజినిపై జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు
ఈ పరిణామాల నేపథ్యంలో కన్నా రజినిపై జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవైపు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సంయమనం పాటించాలని క్లాస్ తీసుకుంటుంటే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కులాలను ఉద్దేశించి చేసిన పాత వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి రావడం వెనుక ప్రత్యర్థి పార్టీల వ్యూహం కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె వైఖరిపై జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
