
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దూకుడు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి పవర్ ఎక్కువ. ఆయన సినిమాలలో అయిన రియల్ లైఫ్ అయిన సరే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు.కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒక్కడిలా ఎదిగారు పవన్. ఢిల్లీలో పలుకుబడి పెంచుకున్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన వెళ్లే రకం పవన్. ఆ గుణమే ఆయనను లీడర్ గా నిలబెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ పై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా మారబోతున్నారా? పవన్ ఏది అడిగినా మోదీ సర్కార్ వెంటనే ఓకే చెబుతోంది కూడా అందుకేనా? ఎన్డీయేలో పవన్ ఈ రేంజ్ ప్రాధాన్యత వెనక అసలు కారణం ఏంటి? అని అందరు చర్చలు జరుపుతున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దూకుడు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా ?
అయితే పవన్ లేవనెత్తుతున్న కొన్ని విషయాలు కూటమిని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటూ ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దాని వల్ల కూటమికి కొంత ఇబ్బంది ఎదురైనా సర్దుకున్నారు. ఆ తరువాత లా అండ్ ఆర్డర్ ఏపీలో సరిగ్గా లేదని చెప్పడంతో కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందిలో పడింది. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన కాకినాడకు వెళ్ళి సముద్రం మధ్యలో ఉన్న షిప్ ని పరిశీలించారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా మీడియా ముందుకు వచ్చి ఆయన అధికారుల తీరు మీద విమర్శలు చేశారు. అయితే అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. వారిని విమర్శిస్తే అది ప్రభుత్వం మీదకే వస్తుందని విశ్లేషకులు చెబుతున్న మాట.
పవన్ విమర్శలు చేసిన ప్రతీసారీ కూటమి ప్రభుత్వం స్పందిస్తొంది. తగిన చర్యలు తీసుకుంటోంది. అయితే నాలుగు గోడల మధ్యన కేబినెట్ మీటింగులలో ఈ విషయాలను లేవనెత్తి వాటికి అక్కడే అర్ధవంతమైన పరిష్కారాలను కనుగొంటే మరింత ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పనిచేయడానికి వీలు అవుతుంది. అలా కాకుండా బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్రభుత్వంలోనే పొరపాట్లు జరుగుతున్నాయని జనాలు అనుకుంటారు. చివరికి ప్రతిపక్షానికి అదే ఆయుధంగా మారుతుందని అంటున్నారు. ఇలా చూస్తే కనుక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వాటి మీద మరీ పట్టింపుగా ఉంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముందుకు పోలేదనే అంటారు. అయితే చంద్రబాబు విశేషమైన అనుభవం ఉన్న వారు కాబట్టి పవన్ లేవనెత్తిన ప్రతీ అంశం మీద లాజికల్ ఎండ్ కి తీసుకుని వచ్చి ఆయనతో పాటు అందరికీ సంతృప్తి పరచేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. రానున్న రోజులలో ఇవి మరింత ఎక్కువ కాకుండా చూసుకుంటే మంచిది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.