lakshmi parvathi : నందమూరి కుటుంబ సభ్యులపై శాపనార్ధాలు పెట్టిన లక్ష్మీపార్వతి వీడియో..!!
lakshmi parvathi : స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన ముద్రతో వంద రూపాయల నాణెం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందకపోవటం పట్ల ఆమె అసహనం చెందారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులు లాగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కి నేను భార్యను కానా..? ఒకవేళ నేను భార్యను కాకపోతే ఆయనకు ఇల్లీగల్ గా ఉన్నానా..? అతను నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్న యుగపురుషుడేనా మీరే సమాధానం చెప్పండి.. అంటూ మీడియా ముందు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్టీఆర్ ప్రాణం తీసిన వాళ్లంతా నాణెం విడుదలకు వెళ్లారు. చివరి రోజుల్లో ఆయనకు తోడుగా ఉన్న తనను మాత్రం పక్కన పెట్టేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్య అని మెడలో బోర్డు వేసుకుని తిరగాలా అని ప్రశ్నించారు. పురందేశ్వరి దుర్మార్గురాలని మండిపడ్డారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకులు కోతులు పురందేశ్వరి ఇంకా భువనేశ్వరి ఇద్దరూ దుర్మార్గురాలు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి కుట్ర చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో పురందేశ్వరి తిరిగే ప్రతి నియోజకవర్గంలో తాను తిరుగుతానని బిజెపికి ఒక సీటు రాకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు కొడుకులు మరియు కూతుర్లు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో మరోసారి ప్రజలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు.
lakshmi parvathi : నందమూరి కుటుంబ సభ్యులపై శాపనార్ధాలు పెట్టిన లక్ష్మీపార్వతి వీడియో..!!
ఎన్టీఆర్ కుటుంబం పై అభిమానంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నానని లక్ష్మీపార్వతి అన్నారు. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరిని బయటకు లాగుతానని శపథం చేశారు. తనని చులకన చేస్తే ఎన్టీఆర్ ని చేసినట్టేనని పేర్కొన్నారు. తండ్రిపై కోపంతో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రిగా పురందేశ్వరి అవినీతి చేశారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానం ఏదో రోజు పురందేశ్వరి కి కూడా జరుగుతుంది. ఆ రోజు కోసం ఈరోజు నుంచే పోరాటం నీ మీద చేస్తాను అంటూ పురందేశ్వరి పై లక్ష్మీపార్వతి శాపనార్థాలు పెట్టారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.